Home ఉద్యోగాలు/Jobs అప్లై చేశారా: ఆర్‌బీఐలో 322 గ్రేడ్‌ బి ఆఫీసర్ ఉద్యోగాలు

అప్లై చేశారా: ఆర్‌బీఐలో 322 గ్రేడ్‌ బి ఆఫీసర్ ఉద్యోగాలు

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ (ఆర్‌బీఐ) 322 ఆఫీసర్‌ గ్రేడ్‌ బి పోస్టుల భర్తీకి తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటిలో జనరల్‌ పోస్టులకు సాధారణ డిగ్రీ అర్హతతో పోటీ పడవచ్చు. ఎంపికైనవారు నెలకు రూ.83 వేలకు పైగా వేతనం లభిస్తుంది.

మొత్తం ఖాళీలు: 322

1) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్‌-బి (డీఆర్‌) జ‌న‌ర‌ల్‌-పీవై 2021: 270 పోస్టులుఅర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌/ త‌త్స‌మాన (లేదా) పోస్టు గ్రాడ్యుయేష‌న్/ స‌ంబంధిత టెక్నిక‌ల్ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణ‌త‌ ఉండాలి.
2) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్-బీ (డీఆర్‌‌) డీఈపీఆర్‌-పీవై 2021: 29 పోస్టులు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌న‌మిక్ అండ్ పాల‌సీ రిసెర్చ్‌)అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ/ త‌త్స‌మాన/ పీజీడీఎం/ ఎంబీఏ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణ‌త ఉండాలి‌.
3) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్‌-బీ (డీఆర్‌) డీఎస్ఐఎం-పీవై 2021: 23 పోస్టులు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ మేనేజ్‌మెంట్‌)

అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త ఉండాలి‌.

ముఖ్య సమాచారం:వ‌య‌సు: 01.01.2021 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జనవరి 28, 2021.ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఫిబ్రవరి 15, 2021.

వెబ్‌సైట్‌:https://www.rbi.org.in/Attachments area

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు