27.7 C
Hyderabad
Tuesday, July 5, 2022
27.7 C
Hyderabad
Tuesday, July 5, 2022
Homeతాజా వార్తలుపాన్ ఇండియా స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ‘రాధేశ్యామ్‌’ రిలీజ్ వాయిదా..

పాన్ ఇండియా స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ‘రాధేశ్యామ్‌’ రిలీజ్ వాయిదా..

దేశంలో కరోనా మహమ్మారి  కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో పెద్ద సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ నెల 7న విడుదల కావాల్సి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం వాయిదా పడగా.. ఇప్పుడు భారీ చిత్రం ‘రాధేశ్యామ్‌’ విడుదలను కూడా వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

నిజానికి ఈ సినిమాని జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు చిత్రయూనిట్… కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ‘రాధేశ్యామ్‌’ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కేకే రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే అలరించనుంది. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

మోస్ట్ పాపులర్