బిగ్ బాస్ సీజన్-4 ఆసక్తి కరం గా సాగింది. ఫినాలే లో చిరంజీవి వచ్చిన తరవాత కార్యక్రమానికి మంచి ఊపొచ్చింది. బిగ్ బాస్ విజేత అభిజిత్ అయినా సోహైల్ కు ఎక్కువగా పేరొంచింది. బిగ్ బాస్ ట్రోఫీ అభిజిత్ గెలుచుకున్నా, అభిమానుల హృదయాలను మరీ ముఖ్యం గా చిరంజీవి మరియు నాగార్జున హృదయాలను గెలుచుకున్నది మాత్రం సోహైల్.
మూడో ప్లేస్ లో ఉండి కూడా 25 లక్షల ప్రైజ్ మనీ తో పాటు చిరంజీవి ని మెప్పించాడు. కథ వేరే ఉంటది అని తన మేనరిజం తో చిరంజీవి ని ఆకట్టుకున్నాడు. అంతటి తో ఆగకుండా, చిరంజీవి ఆ మేనరిజం ను తన సినిమాలో పెట్టుకోవడానికి సోహైల్ ను అడగడం. సోహైల్ సినిమాలో కామియో రోల్ వేస్తాను అని అనడం, మూవీ ఫంక్షన్ కు కూడా వస్తానని అనడం వంటివన్నీ సోహైల్ ని అమాంతం పాపులర్ చేశాయి.
25 లక్షలు తీసుకుని పోటీ నుంచి తప్పుకోవడం, అనే ఎత్తుగడ కూడా ఎంతో మందికి సోహైల్ ను అభిమానులు గా మార్చింది. గెలుచుకున్న ప్రైజ్ మనీ లో తన స్నేహితుడు మెహబూబ్ కు 5 లక్షలు ఇస్తానని అనడం – ఇవన్నీ ఒక ఎత్తు ఐతే బ్రహ్మానందం గారు డబ్బులు తీసుకోకుండా సోహైల్ సినిమాలో నటిస్తానని అనడం మరో హైలైట్.
ఎలిమినేట్ అయిన మెహబూబ్ కు కూడా చిరంజీవి 10 లక్షలు ప్రకటించారు.
ఫినాలే అయ్యి ఒక వారం లోపే సోహైల్ సినిమా ప్రకటించేసారు.
ఐతే బిగ్ బాస్ రన్నర్ అఖిల్ కు మాత్రం పాపం అంతగా ఏమి ఒనగూరలేదు. ఏమైనా రాసి పెట్టి ఉండాలి.