రజనీకాంత్ అన్నాతే షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని మనందరికీ తెలిసిందే. అయితే ఆ షూటింగ్ లో కొంతమందికి కోరోన సోకిందని షూటింగ్ నిలిపివేసారు. రజనీకాంత్ కు నెగటివ్ వచ్చిందని సంతోషించే లోపే అధిక రక్త పోటుతో అపోలో ఆస్పత్రిలో చేరారని తెలిసింది. ఆస్పత్రి వర్గాలు ఎవరినీ అనుమతించడం లేదని తెలుస్తోంది. ఆస్పత్రి వద్ద కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.