ఆహా లో సామ్ జామ్ కార్యక్రమంలో సమంత మెగా స్టార్ చిరంజీవి ని మీరు సూపర్ మాన్, స్పైడర్ మాన్, బాట్ మాన్, హీ మాన్ ల లో ఎలా అవ్వాలని అనుకుంటున్నారు అని అడగగా మెగా స్టార్ చిరంజీవి హను”మాన్” (HANU”MAAN”) అవ్వాలనుకుంటున్నటు చెప్పారు. ఆంజినేయ స్వామి చిరంజీవి ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి అని మనందరికీ తెలిసిని విషయమే.
చిరంజీవి గారు నటించిన సినిమాలు మళ్ళి తీస్తే ఎవరు నటించాలని అన్నుకుంటున్నారు అని వైవా హర్ష అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానాలు
రౌడీ అల్లుడు – అల్లు అర్జున్, రవి తేజ
జగదేక వీరుడు అతిలోక సుందరి – రామ్ చరణ్, మహేష్ బాబు
ఛాలెంజ్ – అల్లు అర్జున్
ఠాగూర్ – పవన్ కళ్యాణ్
విజేత – నాగ చైతన్య
గ్యాంగ్ లీడర్ – చరణ్, తారక్
ఇంద్ర – ప్రభాస్
స్వయం కృషి గురించి అడగగా అది వన్ అండ్ ఓన్లీ మెగస్టార్ అని చెప్పారు
దోశ ఫ్లిప్ ఛాలెంజ్ గెలిచిన మెగాస్టార్. కళ్లకు గంతలు కట్టుకుని దోశని ఫ్లిప్ చేశారు.
మౌత్ ఆర్టిస్ట్ మధు కుమార్ నోటి తో చిరంజీవి బొమ్మను గీశారు. అంతే కాకుండా మధు కుమార్, కొణిదల వెంకట్రావు, చిరంజీవి, రామ్ చరణ్ లు కలసి ఉన్న ఫోటో ని చిరంజీవి కి బహుకరించారు
నిరాశ్రయులను ఆదరించే సంస్థ “సెకండ్ ఛాన్స్” నిర్వాహకులు జాస్పర్ పాల్ మరియు థెరెసా ల కు రెండు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు
చిరంజీవి సమంత ను అభినందిస్తూ మదర్ థెరెసా బొమ్మను బహుమతి గా ఇచ్చారు
చిరంజీవి మనవరాళ్లు చిరంజీవిని భయ్యా అంటారట
ఏ సినిమా చూసినప్పుడు మీకు కన్నీళ్లు వచ్చాయి అని అడగగా శంకరాభరణం అని చెప్పారు
తన సినిమాల లో విజేత చూసినప్పుడు కన్నీళ్లు వస్తాయి అని చెప్పారు. అంతే కాకుండా వేట సినిమా పరాజయం పాలైనప్పుడు బాధ పడినట్టు చెప్పారు