Home ప్రత్యేకం యంగ్‌ రెబల్‌స్టార్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.

యంగ్‌ రెబల్‌స్టార్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.

యంగ్‌ రెబల్‌స్టార్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌..‘సలార్‌’ ముహూర్తం ఖరారు!


టాలీవుడ్‌ బార్డర్లు దాటి పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. అందుకే ఆయనతో సినిమా చేసేందుకు ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్టార్‌ హీరోతో ఆడిపాడేందుకు బాలీవుడ్‌ హీరోయిన్లు సైతం క్యూకడుతున్నారు.అయితే కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ‘సలార్‌’ పనులను ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.


పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కనున్న సలార్‌లో ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్‌ భామ దిశా పటాని నటించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో విలన్‌ పాత్రలో కూడా బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా  ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘ఆది పురుష్‌’ చిత్రీకరణ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సుకుమార్ కూతురి వేడుక‌లో ఎన్టీఆర్, మహేష్, చై ఫ్యామిలీస్ సందడి.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్‌లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్యా నమ్రతతో కలిసి సందడి చేయగా.. నాగచైతన్య,...

కృతి శెట్టికి క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ‘ఉప్పెన’ బ్యూటీ

'ఉప్పెన' సినిమాలో హీరోయిన్‌గా నటించిన యువ నటి కృతి శెట్టి ఎలాంటి నటన కనబర్చిందనేది అందరికీ తెలుసు. రొమాంటిక్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ ఇలా అన్ని కోణాల్లో ఆమె చూపించిన...

‘ఆచార్య’ సెట్స్ లో సందడి చేసిన చిరు, చరణ్.. వైరల్‌ ఫోటోలు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ...

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఇటీవలి వ్యాఖ్యలు