ప్రతీ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంతా ఒక్కచోట చేరి వేడుకలు చేసుకుంటారని తెలిసిందే. ఈ సంక్రాంతికి కూడా చిరు తన కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకున్నారు.ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే మెగా ఇంట జరిగిన ఈ వేడుకల్లో అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగార్జున కూడా పాల్గొనడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ సంక్రాంతి వేడుకలకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగీతం వింటూ మెగా హీరోలతో కలిసి సంక్రాంతి వేడుకను ఎంజాయ్ చేశారు. చిరంజీవి, నాగార్జున సహా మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీశ్, వైష్ణవ్ తేజ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం మెగా ఫ్రేమ్‌లో నాగార్జున నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ కూడా ఓ ఫుల్ లెంత్ రోల్ ప్లే చేస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు చిత్రబృందం.