Home ప్రత్యేకం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దుమ్మురేపిన `రెడ్`!

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దుమ్మురేపిన `రెడ్`!

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం `రెడ్`. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్రవంతీ మూవీస్ సంస్థ నిర్మించింది. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన `రెడ్` చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్‌హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తొలి రోజు థియేట‌ర్లు ఆడియెన్స్ తో నిండిపోయాయి.


తాజా స‌మాచారం ప్ర‌కారం తొలి రోజు రెడ్ సినిమా రూ. 6.70 కోట్లు షేర్ రాబ‌ట్టింది. నైజాంలో రూ.2.19 కోట్లు, సీడెడ్ లో రూ.1.17 కోట్లు, నెల్లూరు రూ.36 ల‌క్ష‌లు, గుంటూరు రూ.46.5 ల‌క్ష‌లు, కృష్ణా రూ.35.3 ల‌క్ష‌లు, ప‌శ్చిమ‌గోదావ‌రి రూ.95.7 ల‌క్ష‌లు, తూర్పు గోదావ‌రి రూ. 63.85 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర రూ.53 ల‌క్ష‌లు వ‌సూళ్ల‌ను రాబట్టింది. అయితే థియేటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ 50 శాతం ఆక్యుపెన్సీతో ఇన్ని కలెక్షన్లు రావడమంటే సాధారణ విషయం కాదంటూ సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.అలాగే వీకెండ్ కావడంతో ఈ సినిమా భారీగానే వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రెడ్ చిత్రాన్ని బ్లాక్ బాస్ట‌ర్ హిట్ గా చేసినందుకు అంద‌రికీ కృతజ్ఞ‌త‌లు. ఫేస్ మాస్కు పెట్టుకుని సినిమాను ఎంజాయ్ చేయండి..ప్రేమ‌తో అంటూ హీరో రామ్ ట్వీట్ చేశాడుAttachments area

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు