‘బాహుబలి’తో నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’లో నటిస్తున్నారు.ఇటలీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాధే శ్యామ్’ ఫస్ట్‌లుక్, టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రాధే శ్యామ్’ చిత్ర యూనిట్ సభ్యులకు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సర్ప్రైజ్ ఇచ్చాడని సమాచారం.ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ప్రతీ సభ్యుడికి ఓ ఖరీదైన రిస్ట్ వాచ్‌లను ప్రభాస్ బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది.ఇక ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ చూసి సంబరపడిన యూనిట్ సభ్యులు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇక పూజ హేగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ పీరియాడికల్ లవ్‌స్టోరిని యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.