Home ప్రత్యేకం దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్య‌క్తి ఎవరో తెలుసా..?

దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్య‌క్తి ఎవరో తెలుసా..?

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిపించారు. వ్యాక్సిన్లతో భారత్‌ సత్తా ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేప్పుడు ఎలాంటి ధైర్యం ప్రదర్శించారో ఇప్పుడు కూడా అంతే ధైర్యాన్ని చూపాలని ప్రధాని అన్నారు. ఇక కరోనా మహమ్మారిపై యుద్ధం సమయంలో యావత్‌ భారతావని కుటుంబంలా మారిందని, సమైక్యతతోనే వైరస్‌ను ఎదుర్కోగలిగామని తెలిపారు.మరోవైపు దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో 100 మందికి చొప్పున నేటి నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు. తొలి విడతలో 3 కోట్ల మందికి, రెండో విడతలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. 


ఇదిలావుండగా దేశంలో తొలి వ్యాక్సిన్‌ను మ‌నీష్ కుమార్ అనే ఓ పారిశుద్ధ్య కార్మికుడు తీసుకున్నాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో వైద్య సిబ్బంది అత‌నికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కూడా ప‌క్క‌నే ఉన్నారు. ఆ త‌ర్వాత ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు..

అత్యంత ప్రముఖమైనవి

మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. మార్చి తొలి వారంలో జరుగనున్న అంతర్జాతీయ ఇంధన వార్షిక సదస్సులో సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్...

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇండియా లెజెండ్స్ క్రికెట్ – మార్చ్ 5 నుంచి

రహదారి భద్రతా ప్రపంచ సిరీస్ లో భాగం గా మార్చ్ 5 న ఈ సిరీస్ ప్రారంభమవుతోంది.  ఆయా దేశాల మాజీ క్రికెటర్ లు ఈ సిరీస్ లో ఆడనున్నారు. ...

ఇటీవలి వ్యాఖ్యలు