Home ప్రత్యేకం ప్రధాని మోదీ టీకా ఎప్పుడు తీసుకుంటారో తెలుసా..!

ప్రధాని మోదీ టీకా ఎప్పుడు తీసుకుంటారో తెలుసా..!

దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసింది. తొలి రోజు 1,91,181 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.అలాగే తొలి రోజు టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పష్టంచేసింది. శనివారం 3351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని తెలిపింది.ఇదిలావుండగా..కరోనా వాక్సిన్ తొలుత కరోనా యోధులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే..అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు కరోనా వాక్సిన్ ఎప్పుడు తీసుకుంటారు అన్న ప్రశ్నలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పందించారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రధాని మోదీ చాలా ఆసక్తికగా ఉన్నారని ఆయన అన్నారు. పారిశుధ్య కార్మికులకు, డాక్టర్లకు,పోలీసులకు టీకా ఇవ్వడం ముగిసిన తర్వాత, 50 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే సమయానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కరోనా టీకాలు తీసుకుంటారని రాజ్‌నాథ్ వెల్లడించారు…

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు