దేశవ్యాప్తంగా అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు.కాగా..ఈ జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.దేశ్ కా మూడ్ పేరిట ఏబీపీ న్యూస్ – సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితులను దేశం ఎలా ఎదుర్కొంది..ప్రధాని నరేంద్ర మోదీ పాలన తీరు ఎలా ఉంది..ముఖ్యమంత్రుల పనితీరు ఎలా ఉంది..అనే అంశాలపై ఈ సర్వే జరిగింది. ఏబీపీ న్యూస్ – సీ ఓటర్.. 543 లోక్ సభ నియోజకవర్గాల్లో 30 వేల మందిని ప్రశ్నించి ఈ సర్వేను నిర్వహించారు.
ఇక అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాలుగో స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఐదో స్థానంలో,ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘల్ ఆరో స్థానంలో ఉన్నారు. ఏడో స్థానంలో మమతా బెనర్జీ, 8వ స్థానంలో శివరాజ్ సింగ్ చౌహన్ నిలిచారు. తొమ్మిదో స్థానంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, పదో స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు.కాగా..ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అట్టడుగున నిలవగా.. హర్యానా సీఎం ఖట్టర్ చివరి నుంచి రెండో స్థానంలో.. పంజాబ్ సీఎం అమరీందర్ కింది నుంచి మూడో స్థానంలో ఉన్నారు….