సాధారణంగా అందరూ వయసు పెరుగుతూ ఉంటే.. ముసలివాళ్లు అయిపోతారు. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం వయసు మీద పడుతున్న ఇప్పటికీ కొత్త యవ్వనంతో తొణికిసలాడుతున్నాడు. అంతేకాదు ఇపుడొచ్చే కుర్ర హీరోలను సైతం కుళ్లుకునేలా చేస్తున్నాడు. మహేష్ బాబు గ్లామర్ పై సామాన్యులే కాదు.. సినీ ప్రియులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మహేశ్‌బాబుపై హీరో మంచు విష్ణు ప్రశంసలు కురిపించాడు. విష్ణు సతీమణి వెరొనికా జన్మదిన వేడుకల్లో మహేశ్ తన సతీమణి నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు విష్ణు..
“ఈ ఫొటోలోని ఒక వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ యువకుడిలా మారిపోతున్నారు. రోజురోజుకి మరింత అందంగా తయారవుతున్నారు. దీనికి ఆయన మంచి తనమే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను” అని విష్ణు ట్వీట్లో పేర్కొన్నారు. ఇక మంచు విష్ణు ట్వీట్‌కు మహేష్ బాబు కూడా స్పందించారు. విష్ణు దంపతుల ఆతిథ్యానికి మహేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. అయితే విష్ణు చేసిన ట్వీట్‌పై మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇదిలావుండగా..మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారి వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు.ఇక మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్ళు’ అనే సినిమాలో నటిస్తున్నారు..