Home ప్రత్యేకం జయలలిత బయోపిక్ 'తలైవి' ఫస్ట్‌లుక్‌ విడుదల

జయలలిత బయోపిక్ ‘తలైవి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ (నాయకి). ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు.ఈ సినిమాలో కరుణానిధిగా ప్రకాశ్‌ రాజ్, యంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.


కాగా..ఆదివారం యంజీఆర్‌ జయంతి. ఈ సందర్భంగా ‘తలైవి’లోని ఓ కొత్త స్టిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. యంజీఆర్‌ అద్భుతమైన నాయకులని, అలానే జయలలితకు ఆయన మార్గనిర్దేశకుడు అంటూ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ను అభిమానులతో  పంచుకున్నారు. అయితే యంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి కనిపిస్తున్న తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుటోంది. దీంతో ఈ స్టిల్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కంగనా తాజాగా షేర్ చేసిన ఫోటోతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి..కాగా..ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్నర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు…

అత్యంత ప్రముఖమైనవి

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. పట్టరాని ఆనందంలో అభిమానులు

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య...

ఇటీవలి వ్యాఖ్యలు