Home ప్రత్యేకం పెళ్లయ్యాక కూడా ఏమాత్రం తగ్గడం లేదు...

పెళ్లయ్యాక కూడా ఏమాత్రం తగ్గడం లేదు…

‘చందమామ’ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ తర్వాత ‘లక్ష్మీ కళ్యాణం’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ్‌లో స్టార్‌ హీరోలందరి సరసన నటించింది. అగ్ర నటులతో పాటు యంగ్‌ హీరోలతోనూ నటించింది. మరోవైపు ఇటీవలే కాజల్‌ మైనపు బొమ్మను మేడమ్‌ టుస్సాడ్స్‌లో నెలకొల్పగా.. ఆ గౌరవం పొందిన తొలి సౌత్‌ హీరోయిన్‌గా కాజల్‌ రికార్డు నెలకొల్పింది.కాగా.. గతేడాది అక్టోబర్‌ 30న కాజల్‌ తన చిరకాల స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును పెళ్లాడిన సంగతి తెలిసిందే.. ముంబైలోని తాజ్‌ మహాల్‌ ప్యాలెస్‌ హోటల్‌లో‌ అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.. కరోనా కారణంగా అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మాత్రమే ఈ వేడుకకి హాజరయ్యారు.మూడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దల సమక్షంలో వివాహా బంధంతో ఒక్కటయ్యారు. 
అయితే పెళ్లయ్యాక కాజల్‌ మరింత దూకుడుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు..ప్రస్తుతం కాజల్‌ చేతిలో కమల్‌ హాసన్‌ ‘భారతీయుడు 2’ ఉండగా రెండు హారర్‌ చిత్రాలు సైతం ఒప్పుకున్నారు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ రూపోందిస్తున్న‘ఆచార్య’ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్‌ జరపుకుంటోంది..ఈ నేపథ్యంలో కాజల్ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…

అత్యంత ప్రముఖమైనవి

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు...

ఇటీవలి వ్యాఖ్యలు