ఆన్ లైన్ చెల్లింపుల వేదిక గూగుల్ పే కన్నా చెందిన ఫోన్ పేను జనం ఎక్కువగా వినియోగించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. ఈ మేరకు డిసెంబరు నెల గణాంకాలను ఎన్పీసీఐ విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం ఫోన్‌పే డిసెంబర్లో టాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ) యాప్‌గా నిలిచింది. డిసెంబర్ నెలలోనే ఫోన్‌పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు ఎన్పిసిఐ విడుదల చేసిన తాజా గణాంకాల చెబుతున్నాయి. మరోవైపు గూగుల్ పేలో రూ.1.76లక్షల కోట్ల విలువైన 854.49 మిలియన్ లావాదేవీలు జరిగాయి. డిసెంబరులో జరిగిన మొత్తం 2,234.16 మిలియన్ యుపిఐ లావాదేవీలలో ఫోన్‌పే, గూగుల్ పే రెండింటి వాటా 78 శాతానికి పైగా ఉన్నాయి.