వెండి తెర ధోనీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అందరినీ ఏడిపిస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఈయన మరణంపై పలు వదంతులు వినిపిస్తున్నాయి. వీటిల్లో ప్రధానమైనది.. ఆర్థిక ఇబ్బందుల వల్ల సుశాంత్ చనిపోయి ఉండొచ్చని కొంత మంది భావిస్తుండగా..ప్రేమ వ్యవహారం వలన మరణించాడని ఇంకొందరు అన్నారు. సీబీఐ ఈ కేసును విచారిస్తుండగా, సుశాంత్ మరణించడానికి గల కారణం ఏంటనేది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది…
కాగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ 35వ పుట్టిన రోజు(జనవరి 21) నేడు. దింతో సుశాంత్ మొదటి జయంతి సందర్భంగా అభిమానులు, సన్నిహితులు, సహా నటీనటులు భావోద్యేగానికి లోనవుతూ సోషల్ మీడియాలో ఆయన ఫొటోలను షేర్ చేస్తున్నారు..ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసారు.. “మూవీ మాఫియా నిన్ను చాలా వేధించారు. సోషల్ మీడియాలో చాలా సార్లు సాయం కోసం అర్దించారు. ఆ సమయంలో నేను సోషల్ మీడియాలో లేనందుకు చింతిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. అలాగే సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కూడా అతడి ఫొటోలను పంచుకున్నారు. దీనికి ‘లవ్ యూ భాయ్.. మీరు మా జీవితంలో భాగం. నిన్ను ఎప్పటికి మర్చిపోలేము’ అంటూ షేర్ చేసిన ఈ ఫొటోలో సుశాంత్ తన మేనల్లుడు, మేనకోడలును ఎత్తుకుని సరదాగా వారితో ఆడుతూ కనిపించాడు. దీంతో శ్వేతా పోస్టు చూసిన సుశాంత్ అభిమానులు ‘దిగ్గజాలకు మరణం లేదు’, ‘సుశాంత్ ఎప్పటికి మన గుండెల్లో బ్రతికే ఉంటారు అని కామెంట్లు చేస్తున్నారు…