Home ప్రత్యేకం బాధ్యతలు చేపట్టిన మర్నాడే భారతీయులకు బైడెన్ తీపి కబురు..

బాధ్యతలు చేపట్టిన మర్నాడే భారతీయులకు బైడెన్ తీపి కబురు..

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ (78) ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎడమ చేతిని బైబిల్‌పై ఉంచి కుడి చేతిని పైకి లేపి బైడెన్‌ ప్రమాణం పూర్తి చేశారు..కాగా,అగ్రరాజ్య అధిపతిగా బాధ్యతలు చేపట్టిన రోజే 15 అంశాలకు సంబంధించిన కార్వనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేశారు. వీటిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలను బైడెన్ పక్కనబెట్టారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం, వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందం, డబ్ల్యూహెచ్ఓ‌లో తిరిగి చేరడం, వలస విధానం సహా పలు కీలక అంశాలు ఉన్నాయి. 
కాగా,యూఎస్‌ సిటిజన్‌షిప్‌ చట్టం-2021 పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లుపై బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేసి ఆమోదం కోసం కాంగ్రె‌స్‌‌కు పంపారు. అక్రమంగా ఉంటున్నవారిని బలవంతంగా పంపే కార్యక్రమాన్ని కూడా మార్చి 21 వరకు నిలిపేయాలని ఆదేశించారు. బైడెన్ నిర్ణయంతో కేవలం హెచ్‌-1బీ వీసాదారులే కాదు, వారి కుటుంబీకులు, డిపెండెంట్స్‌ అందరికీ ఊరట లభించింది. హెచ్‌1బీ వీసా విధానం ద్వారా విశేష ప్రయోజనం పొందుతున్న భారతీయ సాంకేతిక నిపుణులకు, ఇతర వృత్తి నిపుణులు, విద్యార్థులకు ఈ బిల్లు కొత్త ఏడాదిలో మళ్లీ డాలర్‌ డ్రీమ్స్‌ను చిగురింపచేసిందనడంలో సందేహాం లేదు.తాజా బిల్లుతో ఉపాధి-ఆధారిత గ్రీన్‌కార్డు లభించడానికి దేశాలకున్న పరిమితులు తొలగిపోతాయి. ఈ పరిమితి వల్ల భారతీయులు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ నిపుణులు ఎంతో నష్టపోతున్నారు. ఇప్పటి వరకు దేశాల పరిమితి 7 శాతం ఉండగా చిన్న, పెద్ద దేశాలనే తేడా లేదు. తాజాగా వాటిని ఎత్తేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు