Home ప్రత్యేకం హ‌ద్దు మీరిన చైనాకు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్‌

హ‌ద్దు మీరిన చైనాకు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్‌

చైనా మ‌రోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. సిక్కింలోని నకులా వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయి. వీరిని భారత బలగాలు అడ్డుకొన్నాయి.సిక్కిం సెక్టార్‌లోని నాథూ లా సమీపంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసి) మూడు రోజుల క్రితం ఈ ఉదంతం జరిగింది.  ఈ సందర్భంగా  జరిగిన ఘర్షణలో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) సైనికులకు భారతీయ జవాన్లు సరియైన రీతిలో బుద్ధి చెప్పారు.  ఈ ఘర్షణలో ఇరువైపులా సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. కాగా,ఈ ఘటనపై భారత సైన్యం అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. జనవరి 20న ఉత్తర సిక్కింలోని నకులా ప్రాంతంలో భారత్‌-చైనా జవాన్ల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుందని తెలిపారు. అయితే స్థానిక కమాండర్ల జోక్యంతో సమస్య అప్పుడే పరిష్కారమైందన్నారు. 


అయితే తూర్పు లద్దాఖ్‌లో చెలరేగిన వివాదంపై రెండు దేశాల మధ్య తొమ్మిదో విడత‌ చర్చలకు కొద్ది రోజుల ముందే ఈ ఘర్షణ చోటుచేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇక లద్దాఖ్‌ అంశంపై ఆదివారం భారత్‌, చైనా సైనిక ఉన్నతాధికారులు సమావేశమైన విషయం తెలిసిందే.కాగా,గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ త్సో, గాల్వాన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్ తదితర ప్రాంతాల్లో భారత్, చైనా సైన్యాల మధ్య స్టాండాఫ్ ప్రారంభం కావడానికి ముందు కూడా నాకు లా కనుమ వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు