Home ప్రత్యేకం 'ఇస్రో' రికార్డు బ్రేక్..'స్పేస్‌ఎక్స్' అరుదైన ఘనత!

‘ఇస్రో’ రికార్డు బ్రేక్..’స్పేస్‌ఎక్స్’ అరుదైన ఘనత!

అమెరికాకు చెందిన ప్రయివేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ మరో అరుదైన ఘనత సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి ఇప్పుడు స్పేస్‌ఎక్స్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ విజయవంతంగా ఒకేసారి 143 ఉపగ్రహాలను అంతరిక్షకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. దీంతో 2017 ఫిబ్రవరిలో 104 శాటిలైట్స్ ను ప్రవేశ పెట్టి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్ అయింది.


కాగా,అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనవరాల్ నుంచి ఈ ప్రయోగాన్ని స్పేస్‌ఎక్స్ చేపట్టింది. ఈ ప్రయోగం పేరు ట్రాన్స్‌పోర్టర్-1. ఈ ప్రయోగంలో భాగంగా ప్రైవేట్, ప్రభుత్వానికి చెందిన మొత్తం 143 ఉపగ్రహాలను 90 నిమిషాల్లో అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టారు. ఈ ఉపగ్రహాలలో క్యూబ్‌శాట్స్, మైక్రోసాట్స్, 10 స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఉన్నాయి. సుమారు 30 నిమిషాల లిఫ్ట్-ఆఫ్ తర్వాత ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. స్పేస్‌ఎక్స్ తన స్మాల్‌శాట్ రైడ్ షేర్ ప్రోగ్రాం కింద ఈ ప్రయోగాన్ని తొలిసారిగా చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి 200కిలోగ్రాములకు లక్ష్య డాలర్ల రుసుము వసూలు చేసినట్లు తెలుస్తోంది.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

ఐదుగురు అమ్మాయిల ప్రయాణం – సీత ఆన్ ది రోడ్

క్రియేటివిటీ కి బౌండరీలు లేవు.  ఎవరైనా తమ క్రియేటివ్ ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకు రావచ్చు.  అందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి. ...

ఘంటసాల భగవద్గీత… ఇన్ఫోటైన్మెంట్ గురు” యూట్యూబ్ ఛానల్ లో

ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత లో దొరుకుంది.   ఘంటసాల భగవద్గీత శ్లోకాల తాత్పర్యం తో సహా మీ కోసం. “ఇన్ఫోటైన్మెంట్ గురు”...

ఆ సూపర్ ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని..

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'హిట్‌'. 'ది ఫ‌స్ట్ కేస్‌' ట్యాగ్ లైన్‌. శైలేష్...

నిత్యా మీనన్ “నిన్నిలా నిన్నిలా” నేరుగా ఓ టి టి లో

నిత్యా మీనన్, రీతూ వర్మ, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల లో నటించిన " నిన్నిలా నిన్నిలా " చిత్రం నేరుగా జీ ప్లెక్స్ లో ఫిబ్రవరి 26 న...

ఇటీవలి వ్యాఖ్యలు