Home ప్రత్యేకం గణతంత్ర వేడుకల్లో సందడి చేసిన రామ మందిరం

గణతంత్ర వేడుకల్లో సందడి చేసిన రామ మందిరం

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో వేడుకలు అద్భుతంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గణంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.త్రివిధ దళాల సైనిక పాటవాల ప్రదర్శన, శకటాల రూపంలో ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు కన్నులవిందుగా జరిగాయి..


కాగా,ఈ వేడుకల్లో ప్రదర్శించిన శకటాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ రామమందిర శకటం అందరినీ ఆకట్టుకుంది. అయోధ్యలో నిర్మించనున్న రామాలయ ఆకృతిని ప్రతిబింబించేలా ఈ శకటాన్ని రూపొందించారు. శ‌క‌టం ముందు భాగంలో వాల్మీకి అసీనులై రామాయ‌ణ ర‌చ‌న గావిస్తున్న‌ట్లుగా ఆయ‌న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో నూత‌న డిజైన్ ఆధారంగా రామ మందిరాన్ని తీర్చిదిద్దారు. ఇక ఉత్తరప్రదేశ్ శ‌క‌టాల్లోని మ‌ధ్య శ‌క‌టం ముందు భాగంలో అయోధ్య దిపోత్స‌వాన్ని త‌ల‌పించేలా దీపాల‌ను వెలిగించారు

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు