టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారారు.ఇప్పటికే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్.. తాజాగా మరో సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ మల్టీస్టారర్‌గా రూపొంది మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’కు ఇది రీమేక్‌గా వస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది.
పవన్ కల్యాణ్ తాజాగా షూటింగ్ లో పాల్గొనగా.. ఆయనతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వచ్చారు. వీరిద్దరికి సంబంధించిన వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పవన్ కల్యాణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టయిలిష్ లుక్ లో మెడలో ఒక ఎర్ర తాడు తో పవన్ కల్యాణ్ కనిపిస్తున్నారు.భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో పాటు మాటలు అందిస్తున్నాడు