ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021వ సీజన్ కోసం మినీ ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరుగుతుందని ఐపీఎల్ పాలక మండలి తాజాగా ప్రకటించింది. దింతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్,మే నెలల్లో జరగనుందని తెలుస్తోంది. అంతకుముందు ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈలో జరిగిన విషయం తెలిసిందే. అయితే జనవరి 20తోనే ఐపీఎల్ ఆటగాళ్లను విడిచిపెట్టే గడువు ముగిసిపోగా టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకున్నాయి. ఇక జట్ల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ఫిబ్రవరి 4న ముగియనుంది.
ఇదిలావుండగా ఈ వేలానికి ముందు 139 మంది ఆటగాళ్లను 8 ప్రాంఛైజీలు అట్టిపెట్టుకోగా 57 మందిని వేలంలోకి విడిచిపెట్టారు.అయితే వేలంలో అత్యధిక సొమ్ముతో పంజాబ్ బరిలోకి దిగనుంది. కింగ్స్ ఎల్వెన్ పంజాబ్ వద్ద రూ. 53.2 కోట్లు ఉన్నాయి.అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.35.7 కోట్లు,రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రూ.22.9 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ.15.35 కోట్లు,దిల్లీ క్యాపిటల్స్ 12.8 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్ రూ.10.85 కోట్లు, సన్రైజర్స్ హైదరాబాద్ రూ.10.75 కోట్లు ఉన్నాయి.Attachments area