Home ప్రత్యేకం నాలుగేళ్ల తర్వాత శశికళ విడుదల

నాలుగేళ్ల తర్వాత శశికళ విడుదల

అన్నాడీఎంకే సీనియర్ నేత శ‌శిక‌ళ జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో శ‌శిక‌ళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభ‌వించగా ఈ శిక్ష ఈరోజుతో పూర్తి అయింది. అయితే కొద్దిరోజుల క్రితం.. క‌రోనా బారిన‌ప‌డ్డ శ‌శిక‌ళ బెంగ‌ళూరు విక్టోరియా ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 20వ తేదీ నుంచి ఆమె క‌రోనా చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమె విడుద‌ల‌కు సంబంధించిన ప్ర‌క్రియను ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలు అధికారులు ఆస్ప‌త్రిలోనే పూర్తి చేశారు. 2017 ఫిబ్ర‌వ‌రిలో అక్ర‌మాస్తుల కేసులో శ‌శిక‌ళ‌ను అరెస్టు చేశారు.

అయితే  కరోనా నిబంధనల ప్రకారం శశికళ మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలో కొనసాగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. శశికళ జైలు నుంచి విడుదల అయిన సందర్భంగా భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగం అధినేత, ఎమ్మెల్యే దినకరన్‌ టీమ్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.మరోవైపు శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై పార్టీ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు