Home ప్రత్యేకం తెలంగాణలో నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పబోతోంది. త్వరలోనే యాభై వేల ఉద్యోగ నియామకాలను చేపడతామని ప్రకటించిన తెలంగాణ సర్కారు.. మరికొన్ని రోజుల్లో నిరుద్యోగ భృతి అందించే దిశగా అడుగులేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పడం విశేషం. గురువారం నిర్వహించిన రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ నిరుద్యోగ భృతి ప్రస్తావన తీసుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చిందని.. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోవచ్చే బడ్జెట్లో తెలంగాణ సర్కారు నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించే అవకాశం ఉంది.

కాగా,ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..ఇప్పటివరకు టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 36వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్‌ కో, ట్రాన్స్‌ కో, సింగరేణి ద్వారా మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం.ఇలా అన్ని రంగాల్లో కలిపి 1.31 లక్షల ఉద్యోగాలను కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చింది. తాజాగా మరో యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో ఒక శిశువు జన్మిస్తే ప్రభుత్వం అందించే కేసీఆర్ కిట్‌ మొదలు విదేశాలకు వెళ్లి చదువుకునేంతవరకు వివిధ పథకాల రూపంలో అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటోంది. ఇదే వరుసలో త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా వస్తోంది. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది అని గర్వంగా చెబుతున్నా. కొత్త కొత్త ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం.. దర్శకుడెవరంటే?

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సూపర్ స్టార్ట్ అయ్యాడు. 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై మెగా...

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

ఇటీవలి వ్యాఖ్యలు