Home ప్రత్యేకం ‘పుష‍్ప’ షూటింగ్‌లో తీవ్ర విషాదం: షాక్‌లో ఫ్యాన్స్

‘పుష‍్ప’ షూటింగ్‌లో తీవ్ర విషాదం: షాక్‌లో ఫ్యాన్స్

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌‌ కాంబినేషన్‌లో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత వస్తున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక.  పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్‌ తొలిసారి పూర్తిస్థాయి మాస్‌ రోల్‌లో మెప్పించనున్నారు.కాగా,ఈ సినిమా షూటింగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్‌ జీ శ్రీనివాస్ (54) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న నేపథ్యంలో మూవీకి స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో చిత్రబృందం వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మార్గమధ్యంలో కన్నుమూశారు.

దాదాపు 200లకు పైగా చిత్రాలకు శ్రీనివాస్‌ స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు.తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు.మరోవైపు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ పుష్ప మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు నిన్న (జనవరి 28)నే ప్రకటించింది చిత్రయూనిట్.

అత్యంత ప్రముఖమైనవి

‘గ‌జ‌కేస‌రి’గా వస్తోన్న కేజీఎఫ్ ఫేమ్ యశ్.. ఆకట్టుకుంటున్న టీజర్

క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యువ హీరో యశ్. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప్ర‌తి సినిమాను జాతీయ మీడియా...

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఇటీవలి వ్యాఖ్యలు