ఆస్ట్రేలియా జట్టు విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూతురు ఇండి రే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.ఈ విషయాన్ని వార్నర్ గతంలో ఎన్నోసార్లు చెప్పాడు. అయితే ఇండి రేకు కోహ్లీ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ పర్యటనలో తాను వేసుకున్న టెస్టు జెర్సీని గిఫ్ట్ గా అందించాడు. ఈ విషయాన్ని వార్నర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ సందర్భంగా వార్నర్ కోహ్లికి థ్యాంక్స్ చెబుతూ .. “మేం సిరీస్ ఓడిపోయామని మాకు తెలుసు.. కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్న చిట్టితల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతాం. కోహ్లీ నీ జెర్సీ నా కుమార్తెకు పంపినందుకు చాలా థ్యాంక్స్. నీ జెర్సీ ధరించి నా కూతురు మురిసిపోతుంది.”అంటూ క్యాప్షన్ జతచేశాడు. కాగా ఆసీస్ పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో వరుసగా రెండోసారి గెలచుకొని చరిత్ర సృష్టించింది..కాగా, కోహ్లీ పితృత్వ సెలవులపై చివరి మూడు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే.