అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2021 రేసులో నిలిచాడు.ఈ పోటీలో స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ,రష్యా అసమ్మతి నేత అలెక్సీ నవాల్నీ ఈ అవార్డు రేసులో ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో).. అలాగే కోవ్యాక్స్ ప్రోగ్రామ్ కూడా నోబెల్ శాంతి బహుమతి నామినీల జాబితాలో ఉన్నాయి. కాగా,ఒక్క ట్రంప్ మినహా మిగిలిన వాళ్లందరినీ నార్వేకు చెందిన చట్టసభ ప్రతినిధులు నామినేట్ చేశారు.
వాస్తవానికి నోబెల్ బహుమతుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా పార్లమెంట్ల సభ్యులు, సాధారణ ప్రజలు, మాజీ విజేతలు అభ్యర్థుల పేర్లను నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆదివారంతో ఈ నామినేషన్ల గడువు ముగిసింది. అయితే నోబెల్ కమిటీ మాత్రం నామినీల పేర్లను అధికారికంగా బయటపెట్టలేదు.కాగా, 2021 నోబెల్ ప్రైజ్ విన్నర్లను ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రకటించనున్నారు.