Home ప్రత్యేకం మహేశ్ ప్రేమించే ప్లేస్ ఇదే: ఫోటోకలెక్షన్ చూద్దాం రండి!

మహేశ్ ప్రేమించే ప్లేస్ ఇదే: ఫోటోకలెక్షన్ చూద్దాం రండి!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌‌ బాబు  నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’.ఈ చిత్రం ఎప్పుడేప్పుడు సెట్స్‌పై వెళుతుందా అని ఎదురు చూస్తు‍న్న అభిమానులకు మైత్రీ మూవీస్‌ ఇటీవలే సర్‌ప్రైజ్‌ అందించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లో ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీతం అందిస్తున్నారు.కాగా, పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో మహేశ్‌.. పొడవాటి జుట్టు, చెవిపోగుతో  విభిన్నంగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు 14 రీల్స్‌ ప్లస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

కాగా, లాక్‌డౌన్‌ అనంతరం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడంపై మహేశ్‌ బాబు స్పందించారు. దుబాయ్‌ ఎంతో అందమైన ప్రాంతమని ఆయన అన్నారు. “దుబాయ్‌ చాలా బాగుంటుంది. నాకు ఈ ప్రాంతమంటే చాలా ఇష్టం. గతంలో కూడా ఎన్నోసార్లు నేను దుబాయ్‌కు వచ్చాను. కరోనా పరిస్థితుల రిత్యా ఇక్కడ ఫాలో అవుతున్న నిబంధనలు చూస్తే మా చిత్రయూనిట్ కూడా ఎంతో సేఫ్‌గా ఫీల్‌ అవుతోంది. వచ్చే నెలలో కూడా కొన్నిరోజులపాటు ఈ సినిమా షూటింగ్ ఇక్కడే జరగనుంది” అని మహేశ్ వెల్లడించారు

అత్యంత ప్రముఖమైనవి

వెండితెరపైకి గాన గంధర్వుడు ‘ఎస్పీ బాల సుబ్రమణ్యం’ బయోపిక్‌

గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న మరణించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకడంతో అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని...

పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి!

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడుతో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే తన 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్...

ప్రపంచ ధనవంతుల జాబితా ఇదే.. 6.09 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్) అధినేత రూ. 6.09 లక్షల కోట్ల...

ఏప్రిల్ 14న ‘సలార్’ విడుదల చేయడం వెనకున్న అసలు కారణం ఇదేనా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా...

ఇటీవలి వ్యాఖ్యలు