సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’.ఈ చిత్రం ఎప్పుడేప్పుడు సెట్స్‌పై వెళుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు మైత్రీ మూవీస్ ఇటీవలే సర్ప్రైజ్ అందించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీతం అందిస్తున్నారు.కాగా, పవర్ఫుల్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో మహేశ్.. పొడవాటి జుట్టు, చెవిపోగుతో విభిన్నంగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
కాగా, లాక్డౌన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడంపై మహేశ్ బాబు స్పందించారు. దుబాయ్ ఎంతో అందమైన ప్రాంతమని ఆయన అన్నారు. “దుబాయ్ చాలా బాగుంటుంది. నాకు ఈ ప్రాంతమంటే చాలా ఇష్టం. గతంలో కూడా ఎన్నోసార్లు నేను దుబాయ్‌కు వచ్చాను. కరోనా పరిస్థితుల రిత్యా ఇక్కడ ఫాలో అవుతున్న నిబంధనలు చూస్తే మా చిత్రయూనిట్ కూడా ఎంతో సేఫ్‌గా ఫీల్ అవుతోంది. వచ్చే నెలలో కూడా కొన్నిరోజులపాటు ఈ సినిమా షూటింగ్ ఇక్కడే జరగనుంది” అని మహేశ్ వెల్లడించారు.