Home ప్రత్యేకం ఛత్రపతి శివాజీగా సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఛత్రపతి శివాజీగా సూపర్ స్టార్ మహేష్ బాబు!

రాజమౌళి-మహేష్‌ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్: ఛత్రపతి శివాజీగా సూపర్ స్టార్!

దర్శకధీరుడు మరో సూపర్ స్టార్‌తో సినిమాకు సిద్ధమవుతున్నారు.దీంతో త్వరలో టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఆర్ఆర్ఆర్ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న రాజమౌళి త్వరలో మహేష్ బాబుతో సినిమా తెరకెక్కించనున్నట్టు గతేడాది అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దుర్గ ఆర్ట్స్ బేనర్‌పై కేఎల్ నారాయణ చిత్రాన్ని నిర్మించనున్నాడు. దీంతో అటు రాజమౌళితో పాటు… ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి కావడానికి వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది.మరోవైపు మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్‌లు రాజమౌళి, మహేష్‌ సినిమాపై ఓ క్లారిటీని ఇచ్చాయి. దాంతో 2022 ప్రారంభంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ బాబు శివాజీ పాత్రలో నటిస్తాడని ఓ వార్త తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, ఈ వార్త వినగానే, ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు