Home ప్రత్యేకం తొలిసారి కూతురి ఫోటోను షేర్‌ చేసిన కోహ్లీ,అనుష్క

తొలిసారి కూతురి ఫోటోను షేర్‌ చేసిన కోహ్లీ,అనుష్క

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జంటకు ఇటీవల ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.కాగా,తమ కూతురి ఫోటోను మొదటిసారిగా కోహ్లీ,అనుష్క దంపతులు అభిమానులతో పంచుకున్నారు. తమ ముద్దుల కుమార్తెకు విరుష్క జంట సోమవారం నామకరణం చేసింది. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా ‘వామికా’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని నటి అనుష్క శర్మ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఎంతో ప్రేమానురాగాలతో నిండిన మా జీవితాల్లో వామికా ఆ సంతోషాలను మరింత రెట్టింపు చేసింది. తన రాక మా జీవితాల్లో కొత్త వెలుగులను తీసుకొచ్చింది.  ఆనందం, కన్నీళ్లు, ఆందోళన..ఇలా నిమిషాల వ్యవధిలోనే ఎన్నో భావోద్వేగాలు. కానీ మా హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది.  మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు అంటూ అనుష్క సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

అయితే తాజాగా కోహ్లీ, అనుష్క తమ కూతురు ఫోటో షేర్‌ చేయడంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా,2017 డిసెంబర్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వారి వారి కెరీర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్న ఈ జోడీ వీలు కుదిరినప్పుడల్లా సరదాగా సమయం గడుపుతుంటారు. చివరగా జీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క.. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్‌లు నిర్మించింది.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు