శాంతి భద్రతల పరిరక్షణలో అనునిత్యం శ్రమిస్తున్న పోలీసులకు మనస్ఫూర్తిగా నా సెల్యూట్ అన్నారు ప్రముఖ సినీ నటుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్.పోలీస్ ప్రాధాన్యమున్న సినిమా అయితే.. కథ వినకుండానే ఒప్పేసుకుంటానని రామ్‌చరణ్ అన్నారు. పోలీస్ పాత్రలో నటించడం అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు.మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో స్పోర్ట్స్ మీట్ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ధ్రువ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించేందుకు చాలా కష్ట పడ్డానని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ పోలీస్ పాత్రలో నటిస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
అనంతరం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు పిలవగానే విచ్చేసిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్లాస్మా దానం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మెగాస్టార్ చిరంజీవి తమతో కలిసి వచ్చారన్నారు. ఆయనకు సీపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు విజయ్‌కుమార్, ప్రకాశ్‌రెడ్డి, పద్మజ, వెంకటేశ్వర్లు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అథ్లెట్ కోచ్ నాగపూరి రమేశ్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.