Home ప్రత్యేకం జెఫ్ బెజోస్ షాకింగ్‌ నిర్ణయం: అమెజాన్‌ కొత్త సీఈఓ ఎవరంటే..?

జెఫ్ బెజోస్ షాకింగ్‌ నిర్ణయం: అమెజాన్‌ కొత్త సీఈఓ ఎవరంటే..?

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ తన సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ ఏడాది చివరికల్లా సీఈవో పదవి నుంచి వైదొలగనున్నట్లు స్వయంగా ప్రకటించారు.అయితే బెజోస్ తీసుకున్న ఈ నిర్ణయం టెక్‌ దిగ్గజాలతోపాటు,ఇతరులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఇక బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ సీఈవోగా నియామకం కానున్నారు. 27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మెందుకు అ‌మెజాన్‌ను ప్రారంభించిన బెజోస్‌.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఎదిగారు. అంకుర సంస్థగా మొదలైన అమెజాన్ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు సంస్థతో పాటు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం అమెజాన్ ఆస్తుల విలువ 1.6 ట్రిలియన్ డాలర్లు.

కాగా,అమెజాన్ కొత్త సీఈవోగా పగ్గాలు చేపట్టనున్న ఆండీ జెస్సీ 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్‌ మేనేజర్ గా చేరారు. 2003లో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ ఏర్పాటులో కీలకమయ్యారు. కాగా,ఆండీ జెస్సీ ప్రస్తుతం అమెజాన్‌ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం,  అమెజాన్ వెబ్‌ సర్వీసెస్ అధిపతిగా ఉన్నారు. అత్యంత ప్రతిభ కల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లలో జెస్సీ  ఒకరు. టాప్‌ టెక్‌ సంస్థలకు క్లౌడ్-ఆధారిత సేవలను అందించడంలో ముఖ్య పాత్ర పోషించారు.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు