Home ప్రత్యేకం ప్రజాస్వామ్య సూచీలో ఇండియా ర్యాంక్ ఎంతంటే?

ప్రజాస్వామ్య సూచీలో ఇండియా ర్యాంక్ ఎంతంటే?

ప్రజాస్వామ్య సూచీ 2020 ప్రపంచ ర్యాంకుల్లో భారత్‌ 53వ స్థానాన్ని దక్కించుకుంది. అధికారుల్లో ప్రజాస్వామ్యంపై గౌరవం తగ్గడం, పౌర స్వేచ్ఛను అణచివేయడం వంటి కారణాల వల్ల భారత్ ర్యాంకింగ్‌ పడిపోయిందని ది ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ వెల్లడించింది. అదే సమయంలో పక్క దేశాలతో పోల్చితే మాత్రం భారత్‌ మెరుగైన స్థానంలో ఉండడం విశేషం. 2019లో భారత్‌ మొత్తంగా 6.9 స్కోర్‌ సాధించగా తాజాగా అది 6.61కి పడిపోయింది..అంతకుముందు 2014లో 7.92 స్కోర్‌తో భారత్‌ 27వ స్థానంలో నిలిచింది. 

మొత్తం 167 దేశాలకు సంబంధించి ది ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ప్రజాస్వామ్య సూచీలకు సంబంధించి ర్యాంకులు ఇస్తుంది.కాగా..ఈ జాబితాలో నార్వే అగ్రస్థానంలో నిలువగా.. ఐస్‌లాండ్‌, స్వీడన్‌, న్యూజిలాండ్‌, కెనడా.. రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. 167 దేశాల్లో ప్రజాస్వామ్య సూచిక 23 దేశాలను పూర్తి ప్రజస్వామ్య దేశాలుగా, 52 లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాలు, 35 దేశాలు హైబ్రిడ్‌ పాలన, మరో 57 దేశాల్లో నిరంకుశ పాలన ఉన్నట్లుగా అభివర్ణించింది. పొరుగుదేశాలైన శ్రీలంక 68, బంగ్లాదేశ్‌ 76, భూటాన్‌ 84, పాకిస్థాన్‌ 105, ఆఫ్ఘనిస్తాన్‌ 139వ స్థానాల్లో నిలిచాయి.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు