Home ప్రత్యేకం దుబాయ్ అందాలకు ముగ్దుడైన మహేశ్..పిక్స్ వైరల్

దుబాయ్ అందాలకు ముగ్దుడైన మహేశ్..పిక్స్ వైరల్

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’.మహేశ్‌తో ‘మహానటి’ కీర్తి సురేశ్‌ తొలిసారిగా జోడీ కడుతున్నారు. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ క్రమంలో సెట్స్‌లో సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న కీర్తి ఫొటోలు ఆ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

కాగా..దుబాయ్‌ అందాలకు మహేశ్ బాబు ముగ్దుడైపోయాడు. ఈ  నేపథ్యంలోనే షూటింగ్ లోకేషన్లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. మహేశ్ తాజాగా షార్జాకు సమీపంలో ఉన్న ఎడారి అందాలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. షార్జాకు సమీపంలో ఉన్న మ్లైహాలో ‘సర్కారు వారి పాట’ ను చిత్రీకరిస్తుండడం అద్భుతమైన అనుభూతి కలిగిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు, అద్భుతమైన లొకేషన్లు బాగా నచ్చాయి. ఇక్కడి అతిథ్యం, ప్రేమ గొప్పగా ఉన్నాయ`ని మహేశ్ పేర్కొన్నాడు. 

కాగా..భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత మహేశ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం కావడంతో  ‘సర్కారు వారి పాట’ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట

అత్యంత ప్రముఖమైనవి

పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహా ప్రయోగ వాహకనౌక-సీ51 (పీఎస్‌ఎల్వీ)ను అంతరిక్షంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు....

మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. మార్చి తొలి వారంలో జరుగనున్న అంతర్జాతీయ ఇంధన వార్షిక సదస్సులో సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్...

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇటీవలి వ్యాఖ్యలు