టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కార్వాన్కు ప్రమాదం జరిగింది. పుష్ప మూవీ షూటింగ్ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్వాన్ను ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేడయంతో వెనుకనుంచి మరో వావాహం వచ్చి ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో అల్లు అర్జున్ లేరని చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా..సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
కాగా..అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయిక. ఇందులో బన్ని పుష్పరాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. అయితే ఇటీవల ఈ చిత్ర షూటింగ్ రాజమహేంద్రవరం సమీపంలోని మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో జరిగింది. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయింది.ఆగస్టు 13, 2021 ‘పుష్ప’ను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఆ సందర్భంగా ఆసక్తికర పోస్టర్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.