వెస్ట్ ఇండీస్ బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ సంచలన విజయం సాధించింది.
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్ – 430. హాసన్ 103 పరుగులు, ఇస్లాం 59 షకీబ్ 68 పరుగులు చేశారు. వెస్ట్ ఇండీస్ బౌలర్ వారికన 4 వికెట్లు తీశాడు.
వెస్ట్ ఇండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 259 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. ఓపెనర్ బ్రాత్ వైట్ 76 పరుగులు, బ్లాక్ వుడ్ 68 పరుగులు చేశారు. వెస్ట్ ఇండీస్ బౌలర్ మెహదీ హసన్ బౌలింగ్ లోనూ రాణించి 4 వికెట్లు తీశాడు
బంగ్లా దేశ్ రెండవ ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మోమినుల్ హాక్ 115 పరుగులు చేశాడు. లిటన్ దాస్ 69 పరుగులు చేశాడు
395 పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్ట్ ఇండీస్ 59 పరుగుల కే 3 వికెట్లు కోల్పోయింది. అయితే కద అప్పుడే మొదలైంది. అరంగేట్ర ఆటగాడు కైల్ మేయర్స్, మరో అరంగేట్ర ఆటగాడు బ్యానర్ తో కలిసి నాలుగవ వికెట్ కు 216 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ ని మలుపు తిప్పారు. బానర్ అవుట్ అయిన, కైల్ మేయర్స్ చివర వరకు ఉంది వెస్ట్ ఇండీస్ ను విజయ తీరాలకు చేర్చాడు.
మొదటి మ్యాచ్ లోనే అత్యధిక స్కోర్ చేసిన వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లలో రెండవ వాడు. ఆసియా లోనే అత్యధిక పరుగుల చేధించి చరిత్ర సృష్టించిన అరంగేట్ర ఆటగాళ్ల కు అభినందనలు
కైల్ మేయర్స్ మాన్ అఫ్ ది మ్యాచ్ గ నిలిచాడు. బంగ్లాదేశ్ ఆటగాడు మెహదీ హాసన్ సెంచరీ తో పాటు 8 వికెట్లు తీశాడు. ఆతని శ్రమ వృధా అయ్యింది.
ఇంతటి అద్భుతమైన మ్యాచ్ కి బంగ్లా దేశ్ వేదిక కావటంతో…ఇరు జట్ల ఆటగాళ్ళను అభినందించాల్సిందే.