Home ప్రత్యేకం బికినీలో కేక పెట్టిస్తున్న 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ

బికినీలో కేక పెట్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో రాంచరణ్‌ సరసన నటిస్తున్న బాలీవుడ్‌ భామ అలియా భట్ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. గంగూబాయి సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆలియా.. స్వల్ప అస్వప్థతకు లోనుకావటంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం, అదే రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

కాగా, గంగూబాయి చిత్రం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర బృందం పేర్కొంది. భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ రాజ్, శాంతను మహేశ్వరి, సీమా పహ్వా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ గల్లీబాయ్‌ హీరోయిన్‌.. గంగూబాయితో పాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘బ్రహ్మాస్త్రా’, రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలావుండగా, ఆలియా ఇటీవలే రణబీర్ కపూర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేను ఆస్వాదించి ముంబైకి తిరిగి వచ్చింది. హాలిడేకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే తాజాగా అలియా భ‌ట్ మరో హాలీడే టూర్‌లో భాగంగా మాల్దీవుల‌కు వెళ్లింది.అక్కడ బీచ్ ఒడ్డున బికినీలో ఫొటోల‌కు ఫొజులిచ్చింది. ఈ ఫొటోలు అభిమానుల గుండెల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గ‌తంలోను అలియా ఇలా బికినీలో అదరగొట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తోను బిజీగా ఉన్న అలియా భ‌ట్ త్వ‌ర‌లో ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో పెళ్లి పీట‌లెక్క‌నుంది. క‌రోనా లేక‌పోయి ఉండి ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రి వివాహం పూర్తి అయి ఉండేద‌ని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

ఐదుగురు అమ్మాయిల ప్రయాణం – సీత ఆన్ ది రోడ్

క్రియేటివిటీ కి బౌండరీలు లేవు.  ఎవరైనా తమ క్రియేటివ్ ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకు రావచ్చు.  అందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి. ...

ఘంటసాల భగవద్గీత… ఇన్ఫోటైన్మెంట్ గురు” యూట్యూబ్ ఛానల్ లో

ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత లో దొరుకుంది.   ఘంటసాల భగవద్గీత శ్లోకాల తాత్పర్యం తో సహా మీ కోసం. “ఇన్ఫోటైన్మెంట్ గురు”...

ఆ సూపర్ ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని..

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'హిట్‌'. 'ది ఫ‌స్ట్ కేస్‌' ట్యాగ్ లైన్‌. శైలేష్...

నిత్యా మీనన్ “నిన్నిలా నిన్నిలా” నేరుగా ఓ టి టి లో

నిత్యా మీనన్, రీతూ వర్మ, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల లో నటించిన " నిన్నిలా నిన్నిలా " చిత్రం నేరుగా జీ ప్లెక్స్ లో ఫిబ్రవరి 26 న...

ఇటీవలి వ్యాఖ్యలు