Home ప్రత్యేకం 'లైగర్' నుంచి క్రేజీ అప్‏డేట్..రౌడీ హీరో ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్!

‘లైగర్’ నుంచి క్రేజీ అప్‏డేట్..రౌడీ హీరో ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్!

యువ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ ఉపశీర్షిక. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. బాలీవుడ్‌ భామ అనన్య పాండే విజయ్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రంలో బాక్సర్‌గా కనిపించనున్నాడు విజయ్‌.ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

అయితే భారీ అంచనాల నడుమ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ‘లైగర్‌’ రిలీజ్‌ డేట్‌ మాత్రం వెల్లడించలేదు చిత్రబృందం. తాజాగా ఆ శుభవార్తని రేపు (ఫిబ్రవరి 11) ఉదయం గం:8.14ని.లకు చెప్పబోతున్నామంటూ ట్విటర్‌ వేదికగా తెలియజేసింది. కాగా, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు పూరి జగన్నాథ్. రియాలిటీకి దగ్గరగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పూరి.. షూటింగ్ లొకేషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారట.

అయితే కథ ప్రకారం షూటింగ్ మొత్తం ముంబైలో చేయాల్సి ఉంది.. కానీ అక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్న చిత్రయూనిట్, హైదరాబాద్‏లోనే ముంబై సెట్ వేసి షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ‘లైగర్’ తదుపరి షెడ్యూల్ షూటింగ్ ముంబైలోనే చేయాలని పూరి ఫిక్సయినట్లు తెలిసింది. ఈ మేరకు వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు