పశ్చిమ బెంగాల్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం దక్షిణాది పర్యటన చేపట్టింది. ఈసీ పర్యటన ఈనెల 15వ తేదీ వరకు కొనసాగనుంది.ఈ పర్యటన ముగిసిన తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటన వెలువడనుందని సమాచారం.
కాగా,పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఎన్నికలు రెండు నెలల్లో రానున్నాయి. మొత్తం మూడు నెలల్లో ముగించేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రచిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 15 తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల సంసిద్ధతను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన మొదలుపెట్టింది. ఆ పర్యటన ఈనెల 15వ తేదీతో ముగియనుంది. దీని తరువాత నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ) సునిల్ అరోడా, ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్‌లు మూడు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు పర్యటించనున్నారు.