గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ పదవి కోసం భాజపా తరఫున ఆర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్‌రెడ్డి నామినేషన్ వేయగా.. ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్ నిర్వహించారు. అనంతరం విజయలక్ష్మి మేయర్ గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ ఎన్నికలో ఎంఐఎం కూడా తెరాస అభ్యర్థికే మద్దతు తెలిపింది. ఉప మేయర్‌గా తార్నక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. ఎంఐఎం మద్దతివ్వడంతో మేయర్, ఉప మేయర్ పదవులను తెరాస కైవసం చేసుకుంది. కాగా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని ఎన్బీటీనగర్లో విజయలక్ష్మి ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. కార్యకర్తలు, నేతల రాకపోకలతో కొత్త వాతావరణం కనిపిస్తోంది.
* జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజకీయ ప్రస్థానం
పేరు: గద్వాల విజయలక్ష్మి (బంజారాహిల్స్)
వయస్సు: 56
భర్త: బాబీరెడ్డి
విద్యార్హత: ఎల్ఎల్బీ
కులం: మున్నూరు కాపు (బీసీ)
రాజీయ అనుభం: 2016లో బంజారాహిల్స్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి బంజారాహిల్స్ డివిజన్ నుంచి గెలుపొందారు.