రామాయణ గాథ ఆధారంగా హిందీలో భారీ బడ్జెట్తో అల్లు అరవింద్, మధు మంతెన ఓ సినిమా నిర్మించనున్నారు. ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారీ, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకోన్ కనిపిస్తారట. మూడు భాగాలుగా ఈ సినిమాను సుమారు 1500 వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కించనున్నారు.2022లో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్ 2024లో విడుదల కానుంది.
మరోవైపు రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రైత్ ఆది పురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ భారీ బడ్జెట్ ఫ్యాంటసీ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్లతో పాటు కీలక పాత్రలను ఎవరుచేస్తున్నారన్న విషయంపై మూవీ మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై కూడా మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందని సమాచారం. అయితే ఆదిపురుష్ సినిమాను ఆగస్ట్ 11, 2022న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే.ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సహా పలు భాషల్లో విడుదల చేయనున్నారు.