Home ప్రత్యేకం ప్రపంచ కుబేరుడు జెఫ్‌బెజోస్‌.. ఎలాన్‌ మస్క్‌ను వెన‌క్కినెట్టి మళ్లీ అగ్రస్థానానికి

ప్రపంచ కుబేరుడు జెఫ్‌బెజోస్‌.. ఎలాన్‌ మస్క్‌ను వెన‌క్కినెట్టి మళ్లీ అగ్రస్థానానికి

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ మళ్లీ తొలి స్థానన్ని దక్కించుకున్నారు. దాదాపు 45 రోజుల పాటు అగ్ర స్థానంలో కొనసాగిన టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ని ఆయన మంగళవారం వెనక్కి నెట్టారు. టెస్లా షేర్లు మంగళవారం 2.6 శాతం తగ్గడంతో ఆ సంస్థ ఏకంగా 4.6 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయింది. దీంతో ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించినఎలన్‌ మస్క్‌ ఆ స్థానాన్ని కోల్పోయారు. ప్రస్తుతం బెజోస్‌ నికర సంపద 191.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే మస్క్‌ కంటే ఆయన 955 మిలియన్‌ డాలర్లు ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు.

కాగా, జెఫ్ బెజోస్‌ 2017 నుంచి అగ్ర స్థానంలో కొనసాగారు. అమెజాన్‌ కార్యకలాపాలు, విస్తరిస్తున్న కొద్దీ కంపెనీ షేర్ల విలువ పెరుగుతూ వచ్చింది. దీంతో కంపెనీలో అతిపెద్ద వాటాదార్లలో ఒకరైన బెజోస్‌ వ్యక్తిగత సంపద పెరుగుతూ వచ్చింది. వచ్చే ఏడాది అమెజాన్‌ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బెజోస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన తిరిగి అగ్ర స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. కాగా, 27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మెందుకు అ‌మెజాన్‌ను ప్రారంభించిన బెజోస్‌.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు. ఇక బెజోస్‌ స్థానంలో నూతన సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్న ఆండీ జాస్సీ 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్‌ మేనేజర్‌గా చేరారు. 2003లో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ ఏర్పాటులో కీలకమయ్యారు.

అత్యంత ప్రముఖమైనవి

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. పట్టరాని ఆనందంలో అభిమానులు

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య...

ఇటీవలి వ్యాఖ్యలు