మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన తల్లిదండ్రులైన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు సోషల్ మీడియా ద్వారా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. 42వ వార్షికోత్సవం జరుపుకుంటున్న చిరంజీవి, సురేఖ దంపతులకు శుభాకాంక్షలు చెప్పాడు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. నేటితో 42 ఏళ్లు పూర్తయ్యాయి. ‘నా అతిపెద్ద బలం..నా బలహీనత.నా సర్వస్వం మీరే..నా కోసంఎంతో కష్టపడ్డారు. నా కోసం మీరు చేసిన ఎన్నో పనులకు ధన్యవాదాలు. మీపై నా ప్రేమను తెలిపేందుకు మాటలు చాలవు. మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అంటూ రామ్‌చరణ్ ట్వీట్ చేశాడు.
కాగా, చిరంజీవి వారసుడిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక సినిమాల విషయానికొస్తే చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రానికి సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా మ్యాట్నీ మూవీస్ – కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి – చరణ్ కలిసి నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్య చిత్రంతో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. అదే విధంగా త్వరలో శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే.