Home ప్రత్యేకం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు: ఉత్తమ నటి దీపికా.. ఉత్తమ నటుడు అక్ష‌య్

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు: ఉత్తమ నటి దీపికా.. ఉత్తమ నటుడు అక్ష‌య్

చిత్రసీమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే. భారతీయ చలన చిత్ర పితామహుడిగా పేరొందిన దాదా సాహెబ్ ఫాల్కే పేరిట ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంటుంది. తాజాగా 2021 సంవత్సరానికి గాను దాదా సాహెబ్‌ ఫాల్కే సౌత్‌ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం ఫిబ్ర‌వ‌రి 20న ఘ‌నంగా జ‌రిగింది. సినిమా, టీవీ, మ్యూజిక్, ఓటీటీల‌కు సంబంధించి అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. ఇందులో దీపికా ప‌దుకొణే, అక్ష‌య్ కుమార్, సుస్మితా సేన్, సుర‌భి చంద‌, నోరా ఫ‌తేహి వంటి సెల‌బ్రిటీలు అవార్డులు అందుకున్నారు. 

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ‘ల‌క్ష్మీ బాంబ్’ చిత్రానికి గాను ఉత్త‌మ న‌టుడు పుర‌స్కారం అందుకోగా, దీపిక ప‌దుకొణే ‘ఛ‌పాక్’ సినిమాకు గాను ఉత్త‌మ క‌థానాయిక‌గా పుర‌స్కారం కైవసం చేసుకుంది. ఇక గ‌త ఏడాది అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విమ‌ర్శ‌కులచే ప్ర‌శంస‌లు పొందిన న‌టుడిగా ‘చిచోరే’ చిత్రానికి అతన్ని జ్యూరీ ఎంపిక చేసింది. ఇక  యువ కథానాయిక కియారా అడ్వాణీ ‘గిల్టీ’ చిత్రంతో ‘విమర్శకులచే ప్ర‌శంస‌లు పొందిన‌ ఉత్తమ నటి’ విభాగంలో అవార్డును దక్కించుకుంది.

ఉత్తమ చిత్రంగా తానాజీ (ది అన్‌సంగ్‌ వారియర్‌) నిలువుగా… ఉత్తమ దర్శకుడిగా అనురాగ్‌ బసు (లుడో) చిత్రానికి గాను అవార్డు అందుకున్నారు. ఇక ఉత్తమ వెబ్ సిరీస్‌ గా స్కామ్‌ 1992 నిలువుగా ఉత్తమ వెబ్‌సిరీస్‌ నటిగా సుష్మితాసేన్‌ (ఆర్య) చిత్రానికి గాను అవార్డులు అందుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సందీప్‌ కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ మూవీ రివ్యూ:

నటీనటులు : సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, రావు రమేశ్‌, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి తదితరులు ...

టీ విరామ సమయానికి భారత్ 153/6

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు టీ విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు...

కోహ్లీ “డక్ అవుట్” రికార్డు

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు మొదటి సెషన్ లో కోహ్లీ స్టోక్స్ బౌలింగ్ లో డక్ అవుట్...

పవన్-రానా సినిమా ఫోటోలు లీక్.. ఇందులో పవన్ కల్యాణ్ ఎలా కనిపిస్తున్నాడంటే

ఏమని చెప్పాలి.. ఎంతని భయపెట్టాలి.. అయినా ఎంత భయపెట్టినా కూడా అక్కడేం జరుగుతుంది..? ఇప్పుడు లీకుల విషయంలో చిత్రపరిశ్రమ నుంచి ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా.....

ఇటీవలి వ్యాఖ్యలు