ఎలాన్ మస్క్‌కు ఊహించని షాక్.. ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..!
ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఊహించని షాక్ తగిలింది.. బిట్కాయిన్లపై ఆయన చేసిన ట్వీట్ వైరల్ కావడంతో కేవలం ఒకే ఒక్క రోజులో ఆయన 15.2 బిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో రూ. 1.10లక్షల కోట్లు) కోల్పోయారు. గతకొంతకాలంగా బిట్ కాయిన్ విలువ జెట్ స్పీడుతో దూసుకెళ్తుంది.
అయితే, బిట్ కాయిన్ షేర్ విలువ పెరుగుతుండడంపై ట్విటర్ లో ఎలాన్ మస్క్ స్పందించారు. “బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని” ఫిబ్రవరి 20న ట్వీట్ చేశారు. దీనితో టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఈ ఒక్క ట్వీట్ తో 15.2 బిలియన్ డాలర్లు(సుమారు లక్ష కోట్లు) కోల్పోయాడు. టెస్లా సంస్థ ఈక్విటీ విలువ కూడా పడిపోయింది. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, తాజా పతనంతో మస్క్ నికర సంపద 15.2 బిలియన్ డాలర్లు తగ్గి 183.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది.