సినిమా జీవితం అనుకున్నాడు. ఒక రకంగా సినిమాలకు బానిస అయ్యాడు. ఇదంతా దర్శకుడు మణి రత్నం ప్రభావం. నాని కి సినిమా దర్శకుడు అవ్వాలన్న బలమైన కోరిక ఉండేది. తన దూరపు బంధువైన నిర్మాత అనిల్ ద్వారా, రాధా గోపాలం సినిమా క్లాప్ డైరెక్టర్ గా చేశాడు. ఆ తరవాత అల్లరి బుల్లోడు, ఢీ,, అస్త్రం చిత్రాలకు కూడా పని చేశాడు. ఒక సంవత్సరం పాటు నాన్ స్టాప్ నాని అనే కార్యక్రమానికి ఆర్ జె గా పని చేశాడు.
ఆ తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమా “అష్ట చమ్మ” ద్వారా 2008 లో తెలుగు తెరకు హీరో గా పరిచయమయ్యాడు. ఈ సినిమా లో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే రైడ్, స్నేహితుడా చిత్రాలు చేసిన, సోలో హీరో గా భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి పేరు వచ్చింది. అలా మొదలైంది, పిల్ల జమిందార్ వంటి నటనకు అవకాశమున్న పాత్రల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. పాత్ర నిడివి తక్కువగా ఉన్న, రాజ మౌళి “ఈగ” లో సమంత సరసన నటించారు.
అయితే నాని కి కమర్షియల్ స్టేటస్ తెచ్చిపెట్టిన సినిమా మాత్రం భలే భలే మగాడివోయ్. మతి మరపు ఉన్న క్యారెక్టర్ తో అద్భుతమైన టైమింగ్ తో తాన నాచురల్ స్టార్ ఎందుకయ్యాడో మరో సారి నిరూపించాడు. ఆ తర్వాత ఎనిమిది వరస హిట్లతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఆ తరువాత కొన్ని పరాజయాలు పలకరించినా, నాని నటనను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. త్వరలో యాభై సినిమాల మైలు రాయిని కూడా అందుకోబోతు న్నాడు
నిర్మాత గా మారి కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ ను ప్రోత్సహిస్తూ “అ” అనే సినిమా తీశాడు. ఆ సినిమా కు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. విశ్వక్ సేన్ “హిట్” అనే థ్రిల్లర్ ని కూడా రూపొందించారు.
ఇప్పుడు టక్ జగదీశ్ చిత్రం చేస్తున్నారు. బుధవారం నాచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సంధర్భం గా టక్ జగదీశ్ టీజర్ నిన్న విడుదల చేశారు. అంతే కాదండోయ్ 2018 లో స్టార్ మా బిగ్ బాస్-2 కు హోస్ట్ గా వ్యవహరించారు. 2017 లో ఐఫా ఉత్సవానికి కూడా హోస్ట్ గా వ్యవహరించారు.
ఈ రోజు ఈటీవీ “ఢీ” లో నాని కెరీర్ మీద ఒక స్పెషల్ పెర్ఫార్మన్స్ ఉంది
కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఎలాంటి భావాలనైనా అలవోకగా పాలిగించగల మన నాచురల్ స్టార్ నానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.