సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర నేడు ప్రారంభం
భోజనానికి మరో రూపం బోనం. బోనాలని సమర్పించుకోవడం అంటే, అమ్మ వారి కృప కటాక్షాల వల్ల మనకు దక్కిన ఆహారాన్ని, ఆ అమ్మవారికి నివేదన చేయడం ద్వారా కృతజ్ఞత చెల్లించుకోవడం.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం లో ఆషాఢ మాసం బోనాల జాతర నేడు ప్రారంభం అయ్యింది. కరోనా మహమ్మారి విలయ తాండవం నేపథ్యంలో, ఆలయ చరిత్రలో మొదటిసారిగా, ఈసారి భక్తులు లేకుండా ఉత్సవాలు జరుగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ గారి భార్య తొలి బోనం సమర్పించారు.
కరోనా ప్రభావం తీవ్రం గా ఉన్నందువలన, ప్రజలంతా అమ్మవారికి బోనాలను ఇళ్లల్లోనే సమర్పించాలని, ఆలయాలకు రావొద్దని సూచించారు
ఈ బోనాలు కాకతీయుల కాలం నాటివి. ఇప్పటికీ వాటిని మనం కొనసాగిస్తున్నాం. అదే మన సంస్కృతి గొప్పదనం. తెలుగు వారి గొప్పదనం
ఈ సందర్భం గా, యావన్మందికి, ఆ అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆశిద్దాం. అలాగే ఈ కరోనా నుండి యావత్ భారత దేశానికి విముక్తి కలిగించమని వేడుకొందాం.