Home చదువు విద్య నేర్పే గురువులకు కష్టాలు

విద్య నేర్పే గురువులకు కష్టాలు

కరోనా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ పై తీవ్రమైన ప్రభావం చూపింది.  కరోనా అన్ని వ్యవస్థలను ఎలా చిన్నా భిన్నం చేసిందో అదే విధం గా విద్యా వ్యవస్థపైనా చాలా ప్రభావం చూపింది.   మార్చ్ 14 నుండి విద్యా సంస్థలు మూత పడ్డాయి.  అప్పటి నుండి ప్రైవేట్ స్కూల్స్ లో పని చేసే టీచర్స్ కు జీతాలు ఇవ్వలేక చాలా స్కూల్స్ టీచర్స్ ని తొలగించాయి.  కొన్ని స్కూల్స్ 50% జీతాలతో కొంతకాలం నడిపాయి.  ఆ తరవాత తాత్కాలికం గా బ్రేక్ అని టీచర్స్ ని స్కూల్ కి రావద్దన్నారు. జూన్ లో మొదలవ్వాల్సిన  స్కూల్స్ కరోనా దెబ్బకు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి.  కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.

ప్రైవేట్ స్కూల్స్ ఆన్ లైన్ క్లాసెస్ మొదలు పెట్టారు.  పేరెంట్స్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది.     ఆన్ లైన్ క్లాసెస్ వలన కావాల్సిన టీచర్స్ ని ఉంచి మిగిలిన టీచర్స్ కి రెండు లేదా మూడు నెలల బ్రేక్ అని ప్రైవేట్ స్కూల్స్ చెపుతున్నాయి.  ఇలా ఇంట్లో ఉంటున్న టీచర్స్ కు కొత్తగా ఏ ఉద్యోగాలు దొరకవు అలా అని ఎప్పుడు తెరుస్తారో తెలియని స్కూల్స్ కోసం ఎన్నాళ్ళని ఎదురు చూస్తారు.

15 సంవత్సరాల పైబడి అనుభవం ఉన్న టీచర్స్ వేరే ఉద్యోగం చేయలేక తప్పని పరిస్థితులలో టీ షాప్ పెట్టుకోవడం, గ్యాస్ సీలిండెర్స్ మోయడం వంటి పనులను చేస్తున్నారని టీవీ లో చూస్తుంటే చాలా బాధ గా ఉంది.

మనకు తెలిసి వీళ్ళే, మనకు తెలియకుండా ఎంతో మంది టీచర్స్ బతుకు బండి నడవడం కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. 

భార్యా భర్తలు ఇద్దరు అధ్యాపక వృత్తిలో ఉన్న వారైతే…….వారి బాధ చెప్పనలవి కాదు.

స్కూల్ లో రోజు వారి ప్రార్థనల్లో మరియు అధ్యాపక దినోత్సవం నాడు మనం చెప్పుకుంటాం

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః..గురు సాక్షాత్ పరబ్రహ్మ..తస్మైశ్రీ గురవే నమః.

అన్ని ఉద్యోగాలలో కన్నా అతి తక్కువ జీతాలు అందుకునే ఉద్యోగం – అధ్యాపక వృత్తి.

ఇటువంటి మన భారత దేశంలో విద్య నేర్పే గురువుల కష్టాలు, బాధల గురించి మాట్లాడే, ఆలోచించే నాధుడు ఒక్కడు లేదా…!  ప్రభుత్వాలు కూడా ఈ విషయాలని పట్టించుకోవడం లేదు…..!   కరోనా కష్ట కాలం లో, ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజి లో, విద్యా వ్యవస్థకు గురించి మాట్లాడకపోవడం..ఒకింత నిరుత్సాహం కలిగించేదే.

ఓటు బ్యాంకు రాజకీయాలు మరియు కార్పొరేట్ సంస్థలు రాజ్యమేలుతున్న మన దేశంలో…. విద్యతో పాటు విద్య నేర్పించే గురువుల గురించి కూడా ఆలోచించడం మొదలు పెట్టాలి

అత్యంత ప్రముఖమైనవి

వెండితెరపైకి గాన గంధర్వుడు ‘ఎస్పీ బాల సుబ్రమణ్యం’ బయోపిక్‌

గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న మరణించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకడంతో అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని...

పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి!

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడుతో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే తన 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్...

ప్రపంచ ధనవంతుల జాబితా ఇదే.. 6.09 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్) అధినేత రూ. 6.09 లక్షల కోట్ల...

ఏప్రిల్ 14న ‘సలార్’ విడుదల చేయడం వెనకున్న అసలు కారణం ఇదేనా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా...

ఇటీవలి వ్యాఖ్యలు